Telugu Current Affairs One Liners 11 July 2018

Telugu Current Affairs One Liners 11 July 2018

Telugu Current Affairs One Liners 11 July 2018




దక్షిణ కొరియా, భారత్‌ల మధ్య 11 ఒప్పందాలు.దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ భారత పర్యటనలో భాగంగా 2018 జులై 10న డిల్లీలో ప్రధాని నరేంద్రమోడితో సమావేశమయ్యారు

సులభ వాణిజ్య ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు మొదటి రెండు ర్యాంకులు.2017 సంవత్సరానికి కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం 2018 జులై 10న ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ 1, తెలంగాణ నెంబర్‌ 2 స్థానాల్లో నిలిచాయి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సంప్రదాయ వాది జస్టిస్‌ బ్రెట్‌ కెవనాఫ్‌(53)ని నామినేట్‌ చేశారు

గైపోసేట్‌ కలుపు మందుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వ్యవసాయశాఖ 2018 జులై 10న ఆదేశాలు జారీ చేసింది

ట్విటర్‌లో అత్యధిక మంది అనుసరిస్తున్న నాయకుడిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిలిచారు

ఐటీ సేవల ఎగుమతుల్లో భారత్‌ వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌కు 57వ స్థానం దక్కింది

ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ 2018 జులై 10న ఉత్తర్వులు జారీ చేసింది

భారతీయ చారిత్రక పత్రాల(ఆర్కైవ్స్‌) కమిటీ 62వ జాతీయ సదస్సు 2018 జులై 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించారు

2018 జులై 18న ప్రారంభమయ్యే రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో 22 భాషల్లో ఏ భాషలోనైనా సభ్యులు మాట్లాడేందుకు అవకాశాన్ని కల్పించినట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు

తెలంగాణలో వాతావరణం, నీటి వనరుల యాజమాన్యంపై చేపట్టిన ఇండో జర్మన్‌ ప్రాజెక్టును వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ 2018 జులై 10న ప్రారంభించారు

For Daily Quiz

Daily Current Affairs PDF