Telugu Current Affairs One Liners 17 May 2018

Telugu Current Affairs One Liners 17 May 2018

Telugu Current Affairs One Liners 17 May 2018
?ఎవరెస్టు శిఖరాన్ని 22 సార్లు అధిరోహించి నేపాల్‌కు చెందిన కామి రీత షెర్పా(48) ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆగ్నేయ మార్గంలో అధిరోహించి ఈ పర్వత శిఖరాన్ని 2018 మే 16న చేరుకున్నారు.
?పాఠశాలల్లో టీచర్లు హాజరు పిలిచేటప్పుడు ‘యస్‌ సార్‌’, ‘యస్‌ మేడం’ అనే మాటకు బదులు ‘జైహింద్‌’ అని మాత్రమే చెప్పాలని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది
?రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు జపాన్‌ పార్లమెంటు ఒక చట్టం చేసింది.జాతీయ, స్థానిక ఎన్నికల్లో పురుషులకు, మహిళలకు సాధ్యమైనంత సమాన అవకాశాలు కల్పించేలా రాజకీయ పార్టీలను ఈ చట్టం ప్రోత్సహిస్తుంది.
?మన దేశంలోని గోల్కొండ గనుల్లో బయటపడి ఐరోపా రాజవంశీయుల చేతుల్లోకి వెళ్లిన అరుదైన నీలి వజ్రం ‘ఫార్నెస్‌ బ్లూ’ వేలంలో రూ.45 కోట్ల భారీ ధర పలికింది
?తెలంగాణలో రెండు కొత్త మెడికల్‌ కాలేజిలకు కేంద్ర ప్రభుత్వం 2018 మే 16న అనుమతించింది. సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలకు 150 సీట్లు, రంగారెడ్డి జిల్లాలో అయాన్‌ వైద్య కళాశాలకు 150 సీట్ల చొప్పున 2018-19 సంవత్సరానికి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
?ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తొలిసారిగా ‘ఆవశ్యక వ్యాధి నిర్ధారణ పరీక్షల జాబితా’ను విడుదల చేసింది. తరచుగా కనిపించే ఆరోగ్య సమస్యలు, కొన్ని ముఖ్యమైన వ్యాధులను త్వరగా గుర్తించే విధంగా ఈ జాబితాను రూపొందించింది
?బ్యాంకు లావాదేవీల సమయంలో గుర్తింపు ధ్రువీకరణకు ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, ఆరోగ్యం బాగోలేని వారితో పాటు గాయాల పాలైనవారికీ ఉపశమనం కల్పించేలా కేంద్రం చర్యలు తీసుకుంది
?మలేషియాకు చెందిన సంస్కరణవాది అన్వర్‌ ఇబ్రహీం(70) 2018 మే 16న జైలు నుంచి విడుదలయ్యారు
?2018 జూన్‌లో ఆరంభమయ్యే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో విధులు నిర్వర్తించాల్సిన సౌదీ అరేబియా రిఫరీ ఫాహద్‌ అల్‌-మిర్దాసిపై ఆ దేశ ఫుట్‌బాల్‌ సమాఖ్య వేటు వేసింది
?2028 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా భారత రాజధాని డిల్లీ అవతరించనుందని ఐక్యరాజ్య సమితి అంచనా నివేదిక వెల్లడించింది
?ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్‌కు బిజినెస్‌ వరల్డ్‌ మ్యాగజైన్‌ ‘డిజిటల్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం ప్రకటించింది
?కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ 2018 మే 16న న్యూడిల్లీలో స్వచ్ఛసర్వేక్షణ్‌ 2018 ర్యాంకులను ప్రకటించారు.జాతీయ స్థాయిలో 10 లక్షలకు పైబడి జనాభా గల పరిశుభ్ర నగరాల్లో విజయవాడ తొలి స్థానంలో నిలవగా, 1-3 లక్షల జనాభా విభాగంలో ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ నగరంగా తిరుపతి, రాష్ట్రాల రాజధానుల విభాగంలో అత్యుత్తమ ఘన వ్యర్థాల నిర్వహణ నగరంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ర్యాంక్‌లు సొంతం చేసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.