TSPSC TRT 2017 PET Preparation Plan

TSPSC TRT 2017 PET Preparation Plan

TSPSC TRT 2017 PET Preparation Plan

TSPSC TRT 2017 PET Preparation Plan-టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన టీఆర్‌టీ ఖాళీల్లో పీఈటీలు కూడా ఉన్నాయి. ఎంతోకాలంగా వీటి కోసం ఎదురుచూస్తున్న పీఈటీ విద్య పూర్తిచేసిన ఉద్యోగార్థులకు ఇదొక సువర్ణావకాశం. పీఈటీ కొలువులు కొట్టాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలో తెలుసుకుందాం.
-ఖాళీలు: పీఈటీ (స్కూల్ అసిస్టెంట్)-9 (మహిళలకు మాత్రమే), పీఈటీ-374 (తెలుగు-370, ఇంగ్లిష్-1, హిందీ-1, కన్నడ-1, మరాఠీ-1), పీఈటీ-42 (ఉర్దూ మీడియం).
-గమనిక: ఉర్దూ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.
1) ఎస్సెస్సీ స్థాయిలో సంబంధిత భాష ప్రథమ భాషగా లేదా
2) ఇంటర్మీడియట్ స్థాయిలో రెండో భాషగా లేదా
3) డిగ్రీస్థాయిలో సంబంధిత భాష ఒక సబ్జెక్టుగా ఉండాలి.
-పరీక్ష పత్రం ఎంచుకున్న మీడియంలోనే ఉంటుంది.
exam

విద్యార్హతలు

-ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)కి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఎన్సీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత. లేదా
-బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎన్సీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం ఏడాది వ్యవధి కలిగిన బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణత.
-కరెంట్ అఫైర్స్ కోసం పరీక్ష తేదీకి ముందు కనీసం 6 నెలలకు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయి, తెలంగాణ పథకాలు, క్రీడలు-విజేతలు, అవార్డులు, వార్తల్లో వ్యక్తుల వంటి అంశాలను క్షుణ్ణంగా చదవాలి.

పరీక్షలో విజయం సాధించాలంటే

-తొలిసారిగా టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తుండడంతో గతంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
-టీఎస్‌పీఎస్సీ గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను గమనిస్తే సమకాలిక అంశాలకు అధిక ప్రాముఖ్యం ఇచ్చింది. కాబట్టి అభ్యర్థులు జీకేను సమకాలిక అంశాలను అనుసరించి చదవడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు.
-ఉద్యోగ సాధనలో కీలకమైన సబ్జెక్ట్ ఇంగ్లిష్. దీనిలోభాగంగా అభ్యర్థుల ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. కాబట్టి అభ్యర్థులు పదో తరగతి స్థాయి వరకు ఇంగ్లిష్ వ్యాకరణంపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ భాష పదజాలంపై సమగ్ర అవగాహనను పెంపొందించుకోవాలి.

కంటెంట్

  • -గతంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గురుకుల పీడీ, పీఈటీ ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే సంబంధిత సబ్జెక్టులో ఎక్కువగా అభ్యర్థుల సాధారణ విషయ పరిజ్ఞానంపై ప్రశ్నలు వచ్చాయి.
  • -దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, సమగ్రంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
  • -సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నల స్థాయి యూజీ బీపీఈడీ స్థాయిలో ఇవ్వడానికి కారణం పీఈటీ పోస్టులకు యూజీ బీపీఈడీ, బీపీఈడీ చేసినవారు అర్హులు కావడం.
  • -అభ్యర్థులు ఉద్యోగం సాధించాలనుకున్న అతిసులువుగా మార్కులు సాధించగల సబ్జెక్టు అయిన ఆరోగ్య, భద్రత విద్య, అనాటమీ, వ్యాయామ విద్య నిర్వహణ, శిక్షణపై ఎక్కువ శ్రద్ధ కనబర్చాలి.
  • -గత డీఎస్సీలో వచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే ముఖ్యంగా వ్యాయామ విద్యనిర్వహణ, శిక్షణలో ఎక్కువగా ఆటస్థలాల కొలతలు, పరికరాల బరువులు, ఆటల నియమాలపై అధిక ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి అభ్యర్థులు ఈ విషయంపై అధిక శ్రద్ధ వహించి అనేకసార్లు ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
  • -అభ్యర్థులు ఏదైనా ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను చదివి, దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి.
  • -అభ్యర్థులు సొంతంగా ప్రశ్నావళిని తయారుచేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తే బాగా గుర్తుంటాయి.

-కంటెంట్‌ను మొత్తంగా ఆరు విభాగాలుగా విభజించి, ప్రతి విభాగానికి కచ్చితమైన మార్కులు ఇచ్చారు. కాబట్టి అభ్యర్థులు ఏ విభాగాన్నీ విస్మరించకుండా ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా శ్రద్ధగా చదవాలి.
-వ్యాయామ విద్య ముఖ్య ఉద్దేశం విద్యార్థి సమగ్రాభివృద్ధికి తోడ్పడటం. కాబట్టి అభ్యర్థులు ఏదైనా ఒక విషయాన్ని చదివేటప్పుడు దాన్ని విద్యార్థి సమగ్రాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతున్నదనే కోణంలో చదివితే విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ప్రశ్న ఏ రూపంలో అడిగినా సమాధానం గుర్తించే సామర్థ్యం లభిస్తుంది. ఉదా: 1) ఏ యోగాసనం వేస్తే విద్యార్థిలోని శారీరక లోపం అయిన నడ్డిని
నివారించవచ్చు. జవాబు: హలాసనం. 2) విద్యార్థి శారీరక దృఢత్వం పెంపొందిచడంలో ఉపయోగపడే పోషకం. జవాబు: ప్రొటీన్‌లు
-క్రీడా మైదానాల కొలతలు, నియమ నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత క్రీడల అంతర్జాతీయ నియమావళి పుస్తకాలను అనుసరించాలి. ఉదా: కబడ్డీ కొలతలకు సంబంధించిన నియమ, నిబంధనలకు సంబంధించిన ఆలిండియా కబడ్డీ ఫెడరేషన్ నియమావళి పుస్తకాన్ని అనుసరించాలి.
-వివిధ క్రీడలకు సంబంధించిన పదజాలాలకు సంబంధించిన నోట్స్ తయారుచేసుకోవాలి.

జనరల్ టిప్స్

-సాధ్యమైనన్ని మాక్ టెస్టులను రాసి, ఫలితాలను విశ్లేషించుకోవాలి.
-గతంలో నిర్వహించిన డీఎస్సీ ప్రశ్నసరళిని పరిశీలించాలి.
-అధిక సార్లు రివిజన్‌కు ప్రాధాన్యమివ్వాలి.
-వివిధ మెటీరియళ్లపై ఆధారపడకుండా ప్రామాణిక పుస్తకాలకే పరిమితం కావాలి.
-కంటెంట్‌లోని ప్రశ్నలకు త్వరగా సమాధానాలను గుర్తించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
-కీలకమైన చివరి దశ అయిన పరీక్షహాల్‌లో ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశాసంతో ఉండాలి.
-ప్రతిరోజూ రెండు దినపత్రికలు చదవాలి.

మాదిరి ప్రశ్నలు

1. ఒక క్రీడలో నైపుణ్యం ఉన్న క్రీడాకారుడు, మరో క్రీడలో నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి బదలాయింపును ఏమంటారు?

1) వ్యతిరేక బదలాయింపు
2) ద్విపార్శ బదలాయింపు
3) అనుకూల బదలాయింపు
4) శూన్యబదలాయింపు

2. మోకాలిచిప్పలో ఉండే ఎముక?

1) టిబియా 2) పాటిల్లా 3) రేడియస్ 4) స్కేపులా

3. క్యాన్సర్ నివారణకు వేయాల్సిన ఆసనం?

1) ధనురాసనం 2) శలభాసనం
3) వజ్రాసనం 4) పద్మాసనం

4. ఒలింపిక్ పతకంలో ఐదు రింగులు కలిసి ఏ ఇంగ్లిష్ అక్షరాన్ని పోలి ఉంటాయి?

1) M 2) W 3) O 4) Q

5. మీసో సైకిల్ కాల వ్యవధి?

1) నెలలు 2) వారాలు 3) రోజులు 4) ఏడాది

సమాధానాలు: 1-3, 2-2, 3-2, 4-2, 5-2.

ప్రామాణికమైన పుస్తకాలు

1) ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్

2) మెథడ్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్- కమలేశ్, సంగ్రాల్

3) ప్రిన్సిపుల్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్- కమలేశ్, సంగ్రాల్

4) స్పోర్ట్స్ సైకాలజీ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్- కేకే వర్మ

5) అఫిషియేటింగ్ అండ్ కోచింగ్- టాండన్ పబ్లికేషన్

6) యూజీ బీపీఈడీ అండ్ బీపీఈడీ అకాడమీ టెక్ట్స్‌బుక్స్- తెలంగాణ స్టేట్

7) 9, 10వ తరగతుల బయాలజీ అకాడమీ టెక్ట్స్‌బుక్స్- తెలంగాణ స్టేట్

8) సీబీఎస్‌సీ 9, 10, 10+1, 10+2 తరగతుల ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్స్
9) జీకే అండ్ కరెంట్ అఫైర్స్- తెలుగు అకాడమీ బుక్స్
10) ఫిబ్రవరి చివరిలో పరీక్ష ఉండవచ్చు కాబట్టి జనవరి మొదటివారంలోగా సిలబస్ పూర్తిచేసుకొని తర్వాత నమూనా పరీక్షలు, రివిజన్ చేయడం ద్వారా విజయం సాధించవచ్చు.
11) ఈ రోజు నుంచే సిలబస్ ఆధారంగా ఒక సమగ్రమైన ప్రణాళిక, ఆత్మవిశ్వాసంతో అభ్యసిస్తే విజయం మీదే.

(source:https://www.ntnews.com/Nipuna-Education/article.aspx?category=15&subCategory=2&ContentId=481766)