TSPSC TRT 2017 Social Studies Preparation Plan

TSPSC TRT 2017 Social Studies Preparation Plan

TSPSC TRT 2017 Social Studies Preparation Plan

TSPSC TRT 2017 Social Studies Preparation Plan

 

 • కొంతకాలంగా ఎదురుచూస్తున్న టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్‌టీ) ప్రకటన రానే వచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఊహించనివిధంగా కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ రావడం, కొన్ని జిల్లాల్లో పోస్టులు లేకపోవడం, ఉన్న జిల్లాలోనూ పోస్టుల సంఖ్య పరిమితంగా ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టి ఓపెన్ కోటాకు పోటీపడాల్సి రావడంతో ఆశావహులు తమ లక్ష్యసాధనకు పక్కా ప్రణాళికతో సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదవాల్సి ఉంది. ఉపాధ్యాయ నియామకాలను గతంలో జిల్లా సెలక్షన్ కమిటీలు (డీఎస్సీ) నిర్వహించేవి.
 • ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 20 మార్కులు, టీఆర్‌టీకి 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించి, మెరిట్ కం రోస్టర్ విధానంలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనుంది.

Socialstudes సిలబస్‌పై అవగాహన:
-జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్: ఈ విభాగం పరిధి చాలా విస్తృతమైంది. గత ప్రశ్నపత్రాల్ని పరిశీలించినట్లయితే విభిన్న రకాల ప్రశ్నలు ఇచ్చారు. దేశాలు-రాజధానులు, కరెన్సీ-జాతీయ చిహ్నాలు, గ్రంథాలు-రచయితలు-బిరుదులు, క్రీడలు-ట్రోఫీలు, పదవులు, ప్రముఖ వ్యక్తులు, అవార్డులు, ప్రదేశాలు-ప్రాముఖ్యత మొదలైన అంశాలు పరీక్షల్లో ఇచ్చారు. ప్రామాణికమైన పుస్తకాలు, మ్యాగజైన్‌లను చదవడం ద్వారా మంచి స్కోరు సాధించవచ్చు.

Socialకంటెంట్:

 • ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించినవారికే విజయావకాశాలు ఉంటాయి. చాలా విస్తృతమైన సిలబస్, 6 నుంచి 10 తరగతులు పాఠ్యాంశాలకు పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ స్థాయి పుస్తకాల్లోని పాఠ్యాంశాలపై లోతుగా ప్రాథమిక భావనలతో పాటు కీలక భావనలు చదవాల్సి ఉంటుంది. భూగోళ శాస్త్రాల్లో  పటాల అధ్యయనం, పటాల తయారీ, వివిధ రకాల పటాలు, భూమి ఆవిర్భావం, అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి అంతర్భాగం, భూస్వరూపాలు, వాతావరణం, భూకంపాలు, అడవులు, ఖండాలు, భారతదేశం-తెలంగాణ భౌగోళికాంశాల కోసం ప్రామాణిక పుస్తకాలు చదవాలి.
 • పూర్వ ప్రాచీన యుగం నుంచి ఆధునిక యుగం వరకు, ప్రాంతీయరాజ్యాల ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, జాతీయోద్యమాలు, సమకాలీన రాజకీయ పరిస్థితులు, సామాజిక ఉద్యమాల గురించి సిలబస్‌లో ఇచ్చిన అంశాలపై సమగ్ర అవగాహన పొందాలి.
 • పౌరశాస్త్రంలో కుటుంబం, సామాజిక సంస్థలు, మన ప్రభుత్వాలు-చట్ట సభలు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, సామ్యవాదం, సెక్యులరిజం, ప్రపంచశాంతి-భారతదేశం పాత్ర, ఐక్యరాజ్యసమితి-సమకాలీన ప్రపంచం, రవాణా విద్య, సంస్కృతి-సమాచారం మొదలైన అంశాలను చదవడంతో పాటు నోట్స్ తయారుచేసుకోవాలి.
 • అర్థశాస్త్రం పరిధి, సూక్ష్మ, స్థూల అర్థశాస్ర్తాలు, ఉత్పత్తి కారకాలు, వినియోగం డిమాండ్ సిద్ధాంతాలు, సప్లయ్, విలువ, సిద్ధాంతం, జాతీయోద్యమం, బడ్జెట్, ద్రవ్యం-బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం, పారిశ్రామిక, సేవారంగాలు, పంచవర్ష ప్రణాళికలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలపై పాఠశాల పాఠ్య పుస్తకాల్లోని సమాచారం చాలా పరిమితం. కాబట్టి ఇంటర్, డిగ్రీ స్థాయి పుస్తకాలను చదవాల్సి ఉంటుంది.

బోధనా పద్ధతులు (మెథడాలజీ):

 • సాంఘిక శాస్త్రం మెథడాలజీ సిలబస్‌లో పేర్కొన్న సాంఘిక శాస్త్రం- అర్థం, స్వభావం, పరిధి, బోధనా లక్ష్యాలు, కరిక్యులం, బోధనాపద్ధతులు, వార్షిక ప్రణాళిక, యూనిట్, పాఠ్య ప్రణాళిక, బోధన వనరులు, ఉపాధ్యాయుడు-పాత్ర, మూల్యాంకనం అంశాలను చాలా మంది అభ్యర్థులు సులభంగా భావిస్తారు. మారిన పాఠ్య పుస్తకాలు, బోధనా విధానాలు, ఎస్‌ఎల్‌ఈఆర్‌టీ రూపొందించిన ఉపాధ్యాయ కరదీపికలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.
 • కంటెంట్ తర్వాత ఈ విభాగానికే ఎక్కువ మార్కులు కేటాయించారు. ఇందులో ఇచ్చిన ప్రశ్నలు అనుప్రయుక్త సామర్థ్యాన్ని అంచనావేసేవిధంగా ఉంటాయి. విషయ పరిజ్ఞానం బోధనాభ్యసనలో మెథడాలజీని అన్వయం చేయడం, అవగాహన చేసుకోవడంపై ప్రశ్నలను అడగటానికి అవకాశం ఉంది.
 • మెథడాలజీలో ఎక్కువ మార్కులు పొందడానికి నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానాలు, ప్రస్తుతం అమలవుతున్న విధానాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ప్రామాణికమైన పుస్తకాలు సమకూర్చుకొని, గత ప్రశ్న పత్రాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం, ప్రశ్నల సరళిని, సిలబస్ పరిధిని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి.

మొత్తం సిలబస్ ని 10 భాగాలుగా విభజించి ఎలా చదువాలో పూర్తీ ప్లాన్ క్రింది PDF లో పొందు పరిచాము.

Social Studies Syllabus & Schedule

ముఖ్యమైన విషయాలు :

 • చాలామంది అభ్యర్థులు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కోసం మార్కెట్‌లో విడుదలైన ప్రతీ పుస్తకాన్ని చదివేందుకు సిద్ధపడతారు. ప్రామాణికతగల పబ్లికేషన్ పుస్తకాలు, యోజన వంటి మాస పత్రికలు, దినపత్రికల్లోని అంశాలతో నోట్స్ తయారుచేసుకోవడం మంచిది.
 • స్టడీ మెటీరియల్స్, క్వశ్చన్‌బ్యాంక్‌లు చదవడం కన్న, డిస్క్రిప్టివ్ మెటీరియల్ చాప్టర్‌వైజ్‌గా చదివి సొంతంగా నోట్స్ తయారుచేసుకోవాలి. పరీక్షలో అడిగే బహుళైచ్ఛిక ప్రశ్నల్లో ఇచ్చే సమాధానాలు చాలా దగ్గర సంబంధం కలిగి ఉండటంవల్ల తికమక పడే అవకాశం ఉంటుంది. పుస్తకాలు చదివేటప్పుడు కీలక భావనలు, ముఖ్యాంశాలు, ప్రాథమిక భావనలు అండర్‌లైన్ చేసుకోవడం వల్ల పునశ్చరణలో సమయం ఆదా అవుతుంది.
 • చదివిన పాఠ్యాంశాలను గ్రూపుతో చర్చించుకోవడం ద్వారా విషయావగాహనతో పాటు పునర్బలనం కావడం, తన లోపాలు, తప్పులను సరిచేసుకోవడంతోపాటు సమయం కూడా ఆదా చేసుకోవచ్చు.
 • సంక్లిషమైన విషయాలను నిజ జీవిత సంఘటనలు, ఉదాహరణలు, మైండ్‌తో అధ్యయనం చేయడం ద్వారా జ్ఞాపకశక్తి ఎక్కువకాలం ఉంటుంది.
 • వ్యక్తిగా బలాలు, బలహీనతలు గుర్తుంచుకొని తగినవిధంగా విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించేలా కృషిచేయాలి.
 •  ఆత్మవిశ్వాసంతో ప్రామాణిక పుస్తకాలు, సిలబస్ కలిగి ఉన్న పుస్తకాలు విశ్లేషణాత్మకంగా చదువుతుండాలి.

చదవాల్సిన పుస్తకాలు:

 • కంటెంట్ కోసం 6 నుంచి 10 తరగతుల పాఠ్య పుస్తకాలు
 • 6 నుంచి 12 ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు
 • తెలుగు అకాడమీ డీఎడ్, బీఎడ్ పుస్తకాలు – మెథడాలజీ, విద్యా దృక్పథాలు
 • ఇంటర్మీడియట్- హిస్టరీ, ఎకానమీ, సివిక్స్, జాగ్రఫీ
 • డిగ్రీ- హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ
 • జీకే, కరెంట్ అఫైర్స్ కోసం- ప్రామాణిక పుస్తకాలు యోజన మొదలైనవి
 • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే బులెటెన్‌లు.

One thought to “TSPSC TRT 2017 Social Studies Preparation Plan”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.